HomeతెలంగాణTelangana: సచివాలయంలో ఆందోళన.. మూడు నెలలుగా జీతాల్లేవని హౌస్ కీపింగ్ సిబ్బంది నిరసన!

Telangana: సచివాలయంలో ఆందోళన.. మూడు నెలలుగా జీతాల్లేవని హౌస్ కీపింగ్ సిబ్బంది నిరసన!

Secretariat: రాష్ట్ర పాలనా కేంద్రమైన తెలంగాణ సచివాలయం (సెక్రటేరియట్)లో బుధవారం తీవ్ర ఉద్రిక్తత, ఆందోళనకర వాతావరణం నెలకొంది. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది తమకు గత మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలోనే తమకు ఈ దుస్థితి ఎదురుకావడంపై కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

కుటుంబ పోషణ భారమంటూ ఆవేదన: ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఎదురుకుంటున్నట్లుగా తెలిపారు. జీతాలు రాకపోవడంతో నిత్యావసరాలు కొనలేకపోతున్నామని అన్నారు. ఇండ్ల అద్దెలు చెల్లించలేక యజమానుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని కార్మికులు ఆవేదన చెందారు. పిల్లల చదువులకు, వైద్య ఖర్చులకు కూడా పైసలు లేని పరిస్థితి ఏర్పడిందని కన్నీరుమున్నీరయ్యారు.

తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్: ప్రభుత్వ ఉన్నతాధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లు తక్షణమే స్పందించాని కోరారు. తమకు రావాల్సిన మూడు నెలల జీతాల బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలని సిబ్బంది డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.

రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్: పాలనాయంత్రాంగంలో అత్యంత కీలకమైనది సచివాలయం. అయితే అక్కడ పని చేసే సిబ్బంది జీతాల కోసం రోడ్డెక్కి నిరసన తెలపడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటన అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం మరియు కాంట్రాక్ట్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News