Thursday, March 12, 2026
HomeతెలంగాణRevanth Reddy: తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త

Revanth Reddy: తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త

Telangana organic app:తెలంగాణలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇటీవలి కాలంలో ప్రజల్లో ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగం పెరుగుతోంది. ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో మార్కెట్ లో డిమాండ్ కూడా అధికమైంది. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కొంతమంది నకిలీ ఉత్పత్తులను ఆర్గానిక్ పేరుతో విక్రయిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో అసలు ఉత్పత్తులు ఏవి, నకిలీవి ఏవి అన్న విషయంలో వినియోగదారులు అయోమయంలో పడుతున్నారు. ఈ పరిస్థితి వల్ల నిజంగా సేంద్రియ సాగు చేస్తున్న రైతులు కూడా నష్టపోతున్నారు.

- Advertisement -

రైతులకు ప్రత్యేక యాప్ ..

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సేంద్రియ రైతులకు సాంకేతిక మద్దతు ఇవ్వడానికి ఒక ప్రత్యేక యాప్ రూపొందించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. త్వరలోనే ఈ ఆర్గానిక్ యాప్ అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ యాప్ ద్వారా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే సాగును ప్రోత్సహించేందుకు రాయితీలు కూడా అందించనున్నట్లు సమాచారం.

Also Read:https://teluguprabha.net/top-stories/election-of-mayor-deputy-mayors-in-telangana-municipalities-today-all-political-partys-issued-whip/

50 వేల ఎకరాల్లో …

ప్రస్తుతం తెలంగాణలో సుమారు 50 వేల ఎకరాల్లో దాదాపు 10 వేల మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. వరి పంటతో పాటు కూరగాయలు, నూనె గింజలు, పప్పుధాన్యాలు పండిస్తున్నారు. కొంతమంది రైతులు పండ్ల తోటలను కూడా సేంద్రియ విధానంలో నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడరు.

జీవ పదార్థాల ఆధారంగా పంటలు సాగు చేస్తారు. కానీ పంట దిగుబడి వచ్చిన తర్వాత మార్కెటింగ్ వ్యవస్థపై సరైన అవగాహన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం షాపులు, షాపింగ్ మాల్స్ కు సరఫరా చేస్తున్నా, ఎగుమతులు మాత్రం పరిమితంగానే ఉన్నాయి.

టీఎస్‌ఎస్‌వోసీఏ సంస్థను..

సేంద్రియ విత్తనాలు మరియు ఉత్పత్తులకు ధృవీకరణ కోసం 2015లో టీఎస్‌ఎస్‌వోసీఏ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా ముందుగా నమోదు చేసుకుని లైసెన్స్ పొందిన తర్వాతే లేబుల్స్ తో విక్రయాలు చేయాలి. రాష్ట్రంలో సుమారు 200 సంస్థలు లైసెన్సులు పొందాయి. రైతులు కూడా నమోదు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ చాలామంది దరఖాస్తు చేయడం లేదు.

Also Read:https://teluguprabha.net/telangana/hyderabad/tomorrow-bioasia-summit-2026-to-begin-in-hyderabad/

కొంతమంది రైతులు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి తమ సమస్యలను వివరించారు. నకిలీ ఉత్పత్తుల కారణంగా ఆదాయం తగ్గుతోందని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ప్రత్యేక యాప్ రూపొందించాలని సూచించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇతర యాప్ లతో..

టీఎస్‌ఎస్‌వోసీఏ ఆధ్వర్యంలో రూపొందించనున్న ఈ యాప్ లో రాష్ట్రంలోని రైతులు ఏ పంట ఎక్కడ సాగు చేస్తున్నారో, ఉత్పత్తులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో వంటి వివరాలు పొందుపరుస్తారు. రైతుల చిరునామా, మొబైల్ నంబర్, ఫోటోలు, వీడియోలు నమోదు చేయబడతాయి. ఈ యాప్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇతర యాప్ లతో అనుసంధానం చేయనున్నారు. సేంద్రియ ఉత్పత్తుల కొనుగోలు విధానం, ఎగుమతి సంస్థల సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ఉత్పత్తుల వివరాలను సులభంగా తెలుసుకునే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News