HomeతెలంగాణCM Revanth Reddy: మోదీ ఆశీర్వాదం ఉంటే శరవేగంగా తెలంగాణ అభివృద్ధి.. సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం

CM Revanth Reddy: మోదీ ఆశీర్వాదం ఉంటే శరవేగంగా తెలంగాణ అభివృద్ధి.. సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం

Telangana will develop faster if Modi has blessings: ప్రధాని నరేంద్ర మోదీ స్వప్నం వికసిత్‌ భారత్‌తో కలిసి నడుస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయని, ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాల్సిన పని లేదని, అభివృద్ధి గురించే మాట్లాడదామన్నారు. హెచ్‌ఐసీసీలో ప్రధాని చేతుల మీదుగా వర్చువల్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దేశ జనాభాలో తెలంగాణ 3 శాతం వాటా కలిగి ఉంది. ప్రస్తుతం తెలంగాణ దేశ జీడీపీకి 5 శాతం వాటా ఇస్తోంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు. తెలంగాణ రాష్ట్రం మరింత వృద్ది చెందేందుకు, ముందుకెళ్లేందుకు అవసరమైన అభివృద్ధి ఉత్సవం. 2047 నాటికి భారత్‌ను 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో తెలంగాణ 3 ట్రిలియన్‌ డాలర్ల వాటాను కలిగి ఉండాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. 2034 నాటికి తెలంగాణ ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీని సాధిస్తుంది. ప్రధాని మోదీ ఆశీర్వాదం ఉంటే తెలంగాణ తక్కువ సమయంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దేశాభివృద్ధిలో ఆరు మహానగరాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశానికి సింహభాగం ఆదాయం ఇస్తున్న ఆ ఆరు నగరాలను కేంద్రం ప్రోత్సహించాలి’’ అని రేవంత్‌రెడ్డి పీఎం మోదీని కోరారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-delhi-tour/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News