Temperature: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు క్రమేపి ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మూడ్రోజులు పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్‌తో పాటు ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని, గురువారం ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. వడగాలులు వీచే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

