HomeతెలంగాణThummala nageswara rao: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 50 శాతం సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ

Thummala nageswara rao: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 50 శాతం సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ

TG Good news for farmers: ఆహార పంటలు పండించే రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా సచివాలయంలో ఇవాళ పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు మేలు చేసేందుకు గాను పచ్చిరొట్ట, జీలుగ, జనుము, పిల్లపెసర విత్తనాలను 50 శాతం భారీ సబ్సిడీతో అందిస్తున్నట్లు ప్రకటించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, యూరియా వాడకాన్ని తగ్గించి, భూసారాన్ని పెంచేందుకు పచ్చిరొట్ట పంటలను ఎక్కువగా సాగు చేయాలని రైతులను కోరారు. సేంద్రీయ పద్ధతుల ద్వారా భూమిని కాపాడుకుంటూనే అధిక దిగుబడులు సాధించాలన్నారు.

- Advertisement -

Also Read: Moto G37: మోటో నుంచి బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు ఫిదా అవ్వాల్సిందే..!

అధిక ఆదాయాన్నిచ్చే పంటల వైపు మళ్లండి..

నిస్సారంగా మారిన నల్లబీడు భూములను తిరిగి సాగులోకి తెచ్చేందుకు, వాటి పునరుద్ధరణకు రైతులు జిప్సంను వినియోగించాలని మంత్రి తుమ్మల సూచించారు. అదేవిధంగా సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, అధిక ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ వంటి లాభదాయకమైన పంటల వైపు దృష్టి పెట్టాలని రైతులకు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News