TGPSC has another good news for the unemployed: తెలంగాణ నిరుద్యోగ యువతకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా వివిధ విభాగాల్లో 290 ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ నేడు (శుక్రవారం) పాఠశాల విద్యాశాఖ పరిధిలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డిప్యూటీ ఈవో) /గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్-I ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ అధికారికంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 24 అత్యున్నత గెజిటెడ్ కేడర్ పోస్టులను జనరల్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. విద్యాశాఖలో అత్యంత కీలకమైన ఈ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హతలు, ఇతర వివరాలకు కమిషన్ వెబ్‌సైట్ www.websitenew.tgpsc.gov.in ను సందర్శించాలని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.
Also read: Dharmapuri Arvind: మీ వైఫల్యాలను కేంద్రంపై నెట్టొద్దు.. సీఎం రేవంత్‌కు ధర్మపురి అర్వింద్ సూచన

