HomeTop StoriesTGSPC: నిరుద్యోగులకు ఆవిర్భావ దినోత్సవ కానుక.. 290 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్

TGSPC: నిరుద్యోగులకు ఆవిర్భావ దినోత్సవ కానుక.. 290 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్

TGPSC notification for filling 290 jobs: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 290 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ద్వారా వివిధ శాఖల్లోని ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీని ద్వారా రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ సివిల్‌ ఇంజినీర్‌, 49 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌, కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. అర్హులైన అభ్యర్థులు వేర్వేరు పోస్టులకు ఆయా తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

- Advertisement -

Also read: Supreme Court: పెళ్లైనా అర్హురాలే.. కారుణ్య నియామకాల విషయంలో సుప్రీం సంచలన తీర్పు

దరఖాస్తుకు చివరి తేదీలివే..

నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, రోడ్డు భవనాల శాఖలోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్ పోస్టుకు జూన్ 6 నుంచి జూలై 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టుకు జూన్ 8 నుంచి జూలై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులోని అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ (పీసీబీ) పోస్టుకు జూన్ 10 నుంచి జూలై 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, సిలబస్, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ www.tgpsc.gov.in ను సందర్శించవచ్చని కమిషన్ కార్యదర్శి ఎం.హరిత ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News