Three children die in Jagityal: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు ఆనందంగా ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులను మృత్యువు కబలించింది. ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మేడిపల్లి మండలం కొండాపూర్‌లోని శివగంగ ఆలయ పరిధిలోని కోనేరులో ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. వీరిలో ఇద్దరు బాలురు, ఒక బాలిక ఉన్నారు. మృతులను కొండాపూర్ గ్రామానికి చెందిన అడ్లగట్ట శేఖర్ కుమారుడు శరవింద్ శివ (7), రాజేంద్ర ప్రసాద్ కుమారుడు మన్విత్ సాయి (11), కుమార్తె మనస్విని (8)గా గుర్తించారు. కుటుంబ సభ్యులతో కలిసి శివగంగ ఆలయానికి వచ్చిన చిన్నారులు.. తమ తల్లిదండ్రులు మొక్కులు తీర్చుకున్న సమయంలో కోనేరులో ఆడుతూ ప్రమాదవశాత్తు పడిపోయారు. దీంతో, ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయారు. దీంతో, కొండాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also read: BJP Counter: అతను పాక్ చేతిలో కీలుబొమ్మ.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

