Ration beneficiaries: ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లబ్దిదారులకు మరోసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించింది. దీనిలో భాగంగా తెలంగాణలో శనివారం నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని లబ్దిదారులకు అందజేయనున్నారు. ఈ ప్రత్యేక పంపిణీ నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని చౌకధరల (రేషన్) దుకాణాలు ఆగస్టు నెల మొత్తం పూర్తిగా పనిచేయనున్నాయి.
3.41 కోట్ల మందికి ప్రయోజనం: ఈ ప్రత్యేక పంపిణీ ద్వారా రాష్ట్రంలో సుమారు 1.06 కోట్ల రేషన్ కార్డులపై ఉన్న 3.41 కోట్ల మంది లబ్దిదారులు ప్రత్యక్ష ప్రయోజనం పొందనున్నారు. ఈ మూడు నెలల కోటాను ఒకేసారి అందించేందుకు సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం అన్ని రేషన్ షాపుల్లోనూ తగినంత బియ్యం నిల్వలను అధికారులు ముందస్తుగా సిద్ధం చేశారు. ఎలాంటి అంతరాయాలు లేకుండా పంపిణీ సాగేలా ప్రత్యేక పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేశారు.
Also Read-Cylinder prices: తగ్గిన సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఈ-కేవైసీపై కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలతో సర్(SIR) కారణంగా ఈ-కేవైసీ పూర్తి చేసే గడువును పొడిగించింది. ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించినట్లు పౌరసరఫరాల శాఖ పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు E-KYC పూర్తి చేయని రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.

