HomeతెలంగాణManjeera river: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. మంజీరా నదిలోకి దిగి ముగ్గురు మృతి

Manjeera river: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. మంజీరా నదిలోకి దిగి ముగ్గురు మృతి

Three people die while bathing in Manjeera river: కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంజీరా నదిలో స్నానానికి దిగిన నలుగురు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యారు. స్థానికులు గాలింపు చేపట్టి ఒకరిని కాపాడగా.. మరో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మంగల్‌ కిష్టాపూర్‌ గ్రామ వాస్తవ్యులు బాన్సువాడ మండలం బుడిమి శివారులోని మంజీరా నది వద్ద ఎల్లమ్మ తల్లి ఆలయానికి వెళ్లారు. ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకునేందుకు సిద్ధమవుతుండగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్నానానికి మంజీరా నదిలోకి దిగిన భానుప్రసాద్, అనిత (40), పావని (14), శివాని (13) గళ్లంతయ్యారు. ఈ క్రమంలో స్థానికులు గాలింపు చేపట్టి భానుప్రసాద్‌ను రక్షించగా.. మిగిలిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో, మంగల్‌ కిష్టాపూర్‌ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. హెచ్చరిక బోర్డులు లేనందునే ఈ విషాదం చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు.

- Advertisement -

Also read: CM Revanth: బీఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదు.. ఆయనో చెల్లని నోటు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News