Thursday, March 12, 2026
HomeతెలంగాణRamadan: రంజాన్‌ స్పెషల్‌.. పాఠశాలల తరగతుల సమయాల్లో మార్పు

Ramadan: రంజాన్‌ స్పెషల్‌.. పాఠశాలల తరగతుల సమయాల్లో మార్పు

Ramadan Schools Scehdule: రంజాన్‌ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా రాష్ట్రంలో విద్యార్థులకు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ ఉర్దూ మీడియం పాఠశాలల తరగతుల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/top-stories/cm-revanth-reddy-participates-in-bio-asia-2026-conference/

ఈ ఏడాది పవిత్ర రంజాన్ మాసం ఫిబ్రవరి 18 లేదా 19వ తేదీల్లో ప్రారంభం కానుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఆకాశంలో నెలవంక కనిపించిన తేదీని పరిగణనలోకి తీసుకుని రంజాన్‌ మాసం ప్రారంభ తేదీని నిర్ణయిస్తారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ ఉర్దూ మీడియం పాఠశాలల తరగతుల సమయాల్లో మార్పు చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 8 గం. నుంచి మధ్యాహ్నం1.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. అవసరమైతే వారంలో ఒకరోజు అదనంగా తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read: https://teluguprabha.net/telangana/ap-cm-chandrababu-naidu-and-former-cm-ys-jagan-birthday-wishes-to-kcr/

నెలవంక దర్శనంతో రంజాన్‌ మాసం ప్రారంభమైన రోజు నుంచి ముస్లింల ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా, దాదాపు 31 ఏళ్ల తర్వాత రంజాన్‌ ఫిబ్రవరి మాసంలో ప్రారంభం కానుండటం విశేషం. చివరిగా 1995లో ఫిబ్రవరి ఒకటో తేదీన రంజాన్‌ మాసం మొదలైంది. ఈ ఏడాది రంజాన్‌ మార్చి 20 లేదా 21న వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News