HomeతెలంగాణChicken: నాన్ వెజ్ ప్రియులకు గుడ్‌ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు!

Chicken: నాన్ వెజ్ ప్రియులకు గుడ్‌ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు!

Today Chicken price: గత కొన్ని రోజులుగా సామాన్యుడికి చుక్కలు చూపించిన చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. వారం రోజులతో పోలిస్తే ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు గణనీయంగా పడిపోవడంతో మాంస ప్రియులకు ఇది పెద్ద ఊరటగా మారింది.

- Advertisement -

తగ్గిన ధరల వివరాలు: హైదరాబాద్‌లో నిన్నమొన్నటి వరకు రూ.370-380 పలికిన కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర.. ప్రస్తుతం రూ. 270 కి చేరింది. వరంగల్‌లో సైతం హైదరాబాద్ తరహాలోనే ధరలు తగ్గి.. రూ. 270 వద్ద కొనసాగుతున్నాయి. అటు ఏపీలోనూ ధరల తగ్గుదల కనిపిస్తోంది. విజయవాడలో ప్రస్తుతం కేజీ రూ. 340 పలుకుతోంది. రాజమండ్రిలో రూ. 300, అమలాపురంలో రూ. 300-350 మధ్య ధరలు ఉన్నాయి.

తెలంగాణలో చికెన్ షాప్‌ల బంద్: ధరలు తగ్గిన ఆనందంలో ఉన్న వినియోగదారులకు వ్యాపారులు షాక్ ఇచ్చారు. తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులను బంద్‌ చేయనున్నట్లుగా వ్యాపారులు హెచ్చరించారు. పౌల్ట్రీ యజమానులు, బ్రోకర్ల సిండికేట్ వల్ల తాము నష్టపోతున్నామని షాప్‌ల యజమానుల సంఘాలు తెలిపారు. కమీషన్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే నిరవధికంగా షాపులు మూసివేస్తామని వ్యాపార సంఘాలు స్పష్టం చేశాయి.

ధరల తగ్గుదలకు కారణం?: రంజాన్‌ మాసం అయిపోయింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి తాపం పెరగడంతో కోళ్ల మరణాలు సంభవిస్తాయనే భయంతో పౌల్ట్రీ యజమానులు స్టాక్‌ను త్వరగా మార్కెట్‌లోకి విడుదల చేయడం వల్ల సరఫరా పెరిగి ధరలు తగ్గినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఏప్రిల్ 1 నుంచి బంద్ జరిగితే ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News