Sunday, February 8, 2026
HomeతెలంగాణDharmapuri: నేడు ధర్మపురిలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ప‌ర్య‌ట‌న

Dharmapuri: నేడు ధర్మపురిలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ప‌ర్య‌ట‌న

Deputy CM Bhatti: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈరోజు ధర్మపురి నియోజక వర్గంలో పర్యటించనున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ తో కలిసి ప్రత్యేక పూజలు చేస్తారు . ఆతర్వాత రూ.200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

- Advertisement -

రూ.200 కోట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధర్మపురి పర్యటన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ రోజు ఉదయం బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ధర్మపురి జూనియర్ కళాశాల గ్రౌండ్ కు హెలికాప్టర్‌లో చేరుకోనున్నారు. అనంతరం ప్రత్యేక అధికారులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆతర్వాత రూ.200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రూ. 10 కోట్లతో నిర్మించ బోతున్న డిగ్రీ కళాశాల భవనానికి, రూ. 17 కోట్ల తో కట్ట నున్న సీవేజ్ ప్లాంట్ ఎస్సీ హాస్టల్ భవనానికి, ఎలక్ట్రికల్ లైన్ వర్క్స్ కు, 33 / 11కేవీ సబ్ స్టేషన్లకు, వాటర్ సప్లై ఫెసిలిటేషన్, డిస్ట్రిబ్యూషన్ అండర్ ఫార్మ్ మెకానైజేషన్ స్కీంలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆడ్లూరు లక్ష్మణ్ కుమార్‌తో కలసి శంకుస్థాపన చేయనున్నారు.

Also read-Davos: సీఎం ఆహ్వానం.. ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన చిరంజీవి

ధర్మపురిపై వరాలు కురిపించే అవకాశం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఘనంగా స్వాగతించడానికి ధర్మపురి కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తం అవుతున్నారు. ఇవే కాకుండా ధర్మపురిపై ఉప ముఖ్య మంత్రి మరిన్ని వరాల జల్లులు కురిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటనతో ధర్మపురి దశ తిరగబోతుందని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే భట్టి పర్యటనలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ రఘు చందర్ ఆధ్వర్యంలో సీఐ రాం నరసింహ రెడ్డి ధర్మపురిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News