TPCC Cheif Mahesh Goud Comments on SIR: తెలంగాణలో ఎస్‌ఐఆర్‌ను హడావిడిగా చేయాల్సిన అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టబోయే ఎస్‌ఐఆర్ అంశంపై పీసీసీ బృదం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది. అనంతరం మహేశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ వల్లే బెంగాల్‌లో రాజకీయ సమీకరణలు మారాయని స్పష్టం చేశారు. ‘‘గెలవాల్సిన పార్టీలు ఓడిపోయాయి. తెలంగాణలో వచ్చే రెండేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేవు. ఎస్‌ఐఆర్‌ను హడావిడిగా చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రక్రియను ఏడాదిన్నరపాటు జాగ్రత్తగా చేయాలి.
Also Read: https://teluguprabha.net/national-news/udhayanidhi-stalin-comments-about-sanathana-dharma/
జనగణనతో ఎస్‌ఐఆర్‌ను ముడిపెట్టొద్దు..
రాష్ట్రంలో జనగణన ప్రక్రియ ఇప్పటికే జరుగుతోంది. జనగణనతో పాటే ఎస్‌ఐఆర్ నిర్వహిస్తే సిబ్బంది ఒత్తిడి పెరుగుతుంది. అందుకే, జనగణనతో ఎస్‌ఐఆర్‌ను ముడిపెట్టకుండా.. తర్వాత నిర్వహించాలి. ఎస్‌ఐఆర్‌లో ఓటు తొలగిస్తే దరఖాస్తు చేసుకునే గడువు 3 నెలలకు పెంచాలి. ప్రత్యక్షంగా 3-4 సార్లు బీఎల్‌వోలు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటు తనిఖీ చేయాలి’’ అని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు.

