HomeతెలంగాణTPCC Chief: 'బీజేపీ, బీఆర్‌ఎస్‌ యాత్రలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు'

TPCC Chief: ‘బీజేపీ, బీఆర్‌ఎస్‌ యాత్రలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’

TPCC Chief: చేవెళ్ల డిక్లరేషన్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని, దానిని విజయవంతంగా అమలు చేస్తోందని టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావు చేసిన విమర్శలకు కౌంటర్‌గా మహేశ్‌ కుమార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల డిక్లరేషన్ అమలులో భాగంగా దళిత, గిరిజన వర్గాలకు స్పీకర్ పదవితో పాటు నాలుగు మంత్రి పదవులు ఇచ్చామని ఆయన గుర్తుచేశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/work-from-home-for-maruti-suzuki-employees/

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘దళిత బంధు’ పేరిట దళితులను తీవ్రంగా మోసం చేసిందని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. ఆ విషయాన్ని ప్రజలు గమనించారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వమని వెల్లడించారు. రాష్ట్రంలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సహకరిస్తోందని వివరించారు.

Also Read: https://teluguprabha.net/telangana/maoist-narahari-surrenders-before-police/

చేవెళ్ల డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నాం. దళిత బంధు పేరుతో దళితులను మోసం చేసింది ఎవరో ప్రజలకు తెలుసు. హరీష్ రావు ఈ విషయాన్ని గమనించాలి. బీజేపీ భరోసా యాత్రని చూసి రైతులు నవ్వుకుంటున్నారు. బీజేపీ, BRS రెండు పార్టీలు కలిసి రైతుల దగ్గరకి వెళ్తున్నాయి. వరి వేస్తే ఉరి అన్నది బీఅర్‌ఎస్‌ పార్టీ, వరి వద్దు అన్నది బీజేపీ. మాది రైతు ప్రభుత్వం. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే మా లక్ష్యం. కేంద్రం 52 లక్షలు మెట్రిక్ టన్నుల ధ్యానం సేకరణకు సహకారం అందిస్తుంది. నా పై వ్యతిరేక కథనాలు ముగిసిన అధ్యాయం. – టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News