TPCC chief Mahesh Goud on SIR Process: తెలంగాణలో అక్రమంగా ఓట్ల తొలగింపును తీవ్రంగా అడ్డుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) ప్రక్రియపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో 93 లక్షల ఓట్లు తొలగించి.. కేవలం 31 లక్షల ఓట్లు చేర్చారని గుర్తు చేశారు. ఇటీవల ఆ రాష్ట్రంలో టీఎంసీ 30 లక్షల ఓట్ల తేడాతోనే ఓటమి పాలైందన్నారు. తెలంగాణలో ధాన్యం దిగుబడి పెరగడంతో.. కొనుగోళ్లలో కొంత జాప్యం నెలకొందని, సాధ్యమైనంత త్వరగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
Also read: Ponguleti Srinivas Reddy: వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
పీసీసీ మార్పు తుది నిర్ణయం ఏఐసీసీదే..
కాగా, తన పనితీరు బాగోలేదని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని, ఏఐసీసీ లేదా ముఖ్యమంత్రి బేరీజు వేస్తారని చురకలంటించారు. పీసీసీ మార్పులో ఏఐసీసీదే తుది నిర్ణయమన్నారు. ఏఐసీసీ దృష్టిలో బెస్ట్ పీసీసీ తెలంగాణే అని కేసీ వేణుగోపాల్ చెప్పారని గుర్తుచేశారు.

