HomeTop StoriesMahesh Kumar Goud: మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా.. మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కౌంటర్‌.!

Mahesh Kumar Goud: మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా.. మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కౌంటర్‌.!

Mahesh Kumar Goud comments on Jeevan Reddy: కాంగ్రెస్‌ కార్యకర్తలను కాపాడుకుంటామని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని.. సమస్యలన్నీ త్వరలో సర్దుకుంటాయని వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యేతో ఉన్న సమస్యతోనే సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి పార్టీ వీడారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీనియర్లను గౌరవిస్తామని.. వారి సలహాలను పాటిస్తామని చెప్పారు. మంచిర్యాలలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీని నమ్ముకున్న వారికి పదవులు తప్పకుండా వస్తాయని.. అధిష్ఠానం పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం చేస్తుందని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/cm-revanth-inspects-madhapur-tummidikunta-lake-restoration-work/ 

‘జీవన్‌రెడ్డి సీనియర్‌ నేత. ఆయనకు పలు మార్లు మంత్రి శ్రీధర్‌ బాబు, నేను నచ్చజెప్పే ప్రయత్నం చేశాం. ఆయన వినలేదు. జీవన్‌ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యేతో సమస్యలు ఉన్నాయి. అందుకే రాజీనామా చేశారు. అయినా తెలంగాణలో ప్రతిపక్షమే లేదు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు.? ఓ పార్టీలో కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్‌ దోపిడీ పార్టీ. ఇక బీజేపీ తెలంగాణలో మొలకెత్తే అవకాశమే లేదు.’- మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

Also Read: https://teluguprabha.net/telangana/mee-seva-kendras-across-telangana-to-remain-closed-for-36-hours/

⁠ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పోవాలని.. రేవంత్‌ రెడ్డిని ఓడించే పార్టీలో చేరతానని స్పష్టం చేశారు. అయితే తాను ఏ పార్టీలో చేరేది వారం రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. మార్పు కోసం అప్పట్లో కేసీఆర్‌ ఓడిపోవాలని కోరుకున్నానన్నారు. కానీ ఇప్పుడు కూడా మార్పు అవసరం ఉందని పేర్కొన్నారు. అభిమానులు, మిత్రుల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటానని ఉద్ఘాటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News