HomeతెలంగాణTrainee IPS Case: ఉదయ్‌ కృష్ణారెడ్డి రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు..

Trainee IPS Case: ఉదయ్‌ కృష్ణారెడ్డి రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు..

Trainee IPS Case: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసు రోజురోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. పరారీలో ఉన్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే, కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్‌ రిపోర్టు ప్రకారం… ఉదయ్‌ కృష్ణారెడ్డి.. బాధిత ట్రైనీ ఐపీఎస్‌ అధికారికి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది.

- Advertisement -

ట్రైనీ మహిళా ఐపీఎస్ పై లైంగిక వేధింపులు
ఉదయ్‌ వ్యక్తిగత వివరాలు తెలుసుకున్న అనంతరం ఆమె పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత జాతీయ పోలీసు అకాడమీలో (ఎన్‌పీఏ) శిక్షణ పొందుతున్న సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి కొంతకాలం వారి మధ్య సంబంధాలు కొనసాగినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. ట్రైనీ మహిళా ఐపీఎస్‌ అధికారిపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్‌ కృష్ణారెడ్డికి సంబంధించిన కీలక వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పలు అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.

అయితే, ఈ ఏడాది మే నెలలో మహిళా ఐపీఎస్‌ అధికారికి వివాహం జరిగిన తర్వాత కూడా ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆమెను వేధించడం కొనసాగించాడని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఇతరులతో మాట్లాడటం లేదా సన్నిహితంగా ఉండటాన్ని ఉదయ్‌ వ్యతిరేకిస్తూ మానసికంగా వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.అంతేకాకుండా, ఎన్‌పీఏలో శిక్షణ సమయంలో మరికొందరు మహిళా ఐపీఎస్‌ అధికారులను కూడా ఉదయ్‌ ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయని రిమాండ్‌ రిపోర్టులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

Also Read: Bogatha: ఉప్పొంగిన బొగత జలపాతం.. సందర్శనకు బ్రేక్‌

ఉదయ్ స్వస్థలంలో విచారణ
అయితే, ఈ ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని.. పూర్తి వాస్తవాలు విచారణ అనంతరం మాత్రమే వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హైదరాబాద్‌తో పాటు ఉదయ్‌ కృష్ణారెడ్డి స్వస్థలంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. సోషల్‌ మీడియా ఖాతాలు, డిజిటల్‌ ఆధారాలు, ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ వివరాలను పరిశీలిస్తూ సాక్ష్యాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఉదయ్‌ కృష్ణారెడ్డి న్యాయస్థానం ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. దర్యాప్తు పురోగతిని బట్టి కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News