HomeతెలంగాణHydra team: హైడ్రా టీమ్‌లో 16 మంది ట్రాన్స్‌జెండర్లు.. 'ఈగిల్ టీమ్' పేరిట విధులు.. సత్పలితాలిస్తోన్న...

Hydra team: హైడ్రా టీమ్‌లో 16 మంది ట్రాన్స్‌జెండర్లు.. ‘ఈగిల్ టీమ్’ పేరిట విధులు.. సత్పలితాలిస్తోన్న ప్రభుత్వ చొరవ

Transgenders in Hydra team: సమాజంలో మార్పునకు నాంది పలుకుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఓ కార్యక్రమం సత్పలితాలిస్తోంది. హైడ్రాలో 16 మంది ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు కల్పించి, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన ప్రభుత్వం.. వారికి గౌరవప్రదమైన జీవనోపాధిని అందించడమే కాకుండా.. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగస్వాములను చేసింది. హైడ్రా బృందంలో ప్రస్తుతం 11 మంది ట్రాన్స్ మహిళలు, ఐదుగురు ట్రాన్స్ పురుషులు పనిచేస్తుండగా.. వారంతా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు, ప్రభుత్వ భూములపై అక్రమ కట్టడాలను తొలగించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. కబ్జాదారులు ఎంతటి పలుకుబడి ఉన్నవారైనా భయపడకుండా, నిర్భయంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని ‘హైడ్రా ఈగిల్ టీమ్’ పేరుతో పిలుస్తున్నారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలంలోని ఐలాపూర్‌లో 862 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని, మాదాపూర్‌లోని ఎదులకుంట చెరువును కబ్జాదారుల బారి నుంచి కాపాడటంలో ఈ బృందం కీలక పాత్ర పోషించింది. కబ్జాల తొలగింపు సమయంలో ప్రజలకు నచ్చజెప్పడం, మహిళలతో మాట్లాడి ఉద్రిక్తతలు తగ్గించడం, అధికారులు, ప్రజల మధ్య సమన్వయం చేయడంలో వీరు అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శిస్తున్నారని హైడ్రా అధికారులు కీతాబిచ్చారు. హైడ్రా ఈగల్‌ టీమ్‌ క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని ప్రశంసించారు.

- Advertisement -

Also read: Property dispute: కళ్లలో కారం చల్లి.. కత్తులతో తెగ నరికి.. భూతగాదాతో ఆరుగురి హత్య..!

అవకాశాలిస్తే ఏ రంగంలోనైనా రాణించగలం..

“ఈ ఉద్యోగం తమకు కేవలం జీవనోపాధి మాత్రమే కాదని, జీవితానికి కొత్త గుర్తింపును, ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. హైడ్రా యూనిఫాం ధరించి విధులకు హాజరవడం తమకు ఎంతో గర్వంగా ఉంది. గతంలో బతుకుదెరువు కోసం అడుక్కునేవాళ్లం. ఎక్కడికి వెళ్లినా హేళన చేసేవారు. పని అడిగితే ముఖం మీదే లేదనేవారు. కానీ, ఇప్పుడు యూనిఫాంలో విధులకు వెళుతుంటే అందరూ మర్యాదగా మాట్లాడుతున్నారు. అవకాశం ఇస్తే ట్రాన్స్‌జెండర్లు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపిస్తున్నాం. హైడ్రాలో మా విధులే దీనికి నిదర్శనం. ఇక్కడి అధికారులు, ఇతర సిబ్బంది మమ్మల్ని అందరి మాదిరిగానే చూస్తారు. ఈ ఉద్యోగం వల్ల వీరు ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడి, తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నాం.” అని తాన్షి రాయ్ అనే ట్రాన్స్‌జండర్‌ సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News