HomeతెలంగాణUttam Kumar Reddy: తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు.. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

Uttam Kumar Reddy: తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు.. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

Uttam Kumar Reddy on Paddy Collection: రాష్ట్రంలో 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు చెల్లింపులు చేశామని తెలిపారు. ఈ ఒక్క ఏడాదిలోనే వరి రైతులకు రూ.45 వేల కోట్లు చెల్లించామన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తరుగు పేరుతో దళారులు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా అధికారులు వ్యవహరించవద్దు. వర్షాలతో ధాన్యం తడిచినా కొనాల్సిందే. ఫీల్డ్‌లో 21 కోట్ల గన్నీ బ్యాగులు ఉన్నాయి. వాటికి ఎలాంటి కొరత లేదు.’’ అని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Also read: KTR election sketch: డిసెంబర్‌లోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. సిద్ధమవ్వాలని కేడర్‌కి కేటీఆర్‌ పిలుపు..!

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News