HomeతెలంగాణVem Narender: రేవంత్ రెడ్డి టీమ్‌లో కీలక మార్పు.. సీఎం సలహాదారు పదవికి వేం నరేందర్‌...

Vem Narender: రేవంత్ రెడ్డి టీమ్‌లో కీలక మార్పు.. సీఎం సలహాదారు పదవికి వేం నరేందర్‌ రాజీనామా!

CM advisor: తెలంగాణ ప్రభుత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాజకీయ వ్యవహారాల సలహాదారు (Public Affairs Advisor) వేం నరేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి సమర్పించారు.

- Advertisement -

రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వేం నరేందర్‌రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి నామినేషన్‌ పత్రాన్ని అందజేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో నరేందర్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు భారీ ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు.

Also read-Congress: అభిషేక్‌ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

రేవంత్ రెడ్డికి నమ్మకస్తుడిగా పేరు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేం నరేందర్‌రెడ్డి మొదటి నుంచీ వెన్నంటి ఉంటూ వస్తున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనను నేరుగా పార్లమెంటుకు పంపాలని పార్టీ అధిష్టానం భావించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News