HomeTop StoriesVennela Gaddar: ముమ్మాటికి మా అయ్యల జాగీరే..! మిమ్మల్ని కేవలం సినిమా నటుడిగానే చూస్తాం..! వెన్నెల...

Vennela Gaddar: ముమ్మాటికి మా అయ్యల జాగీరే..! మిమ్మల్ని కేవలం సినిమా నటుడిగానే చూస్తాం..! వెన్నెల గద్దర్‌ సంచలన వ్యాఖ్యలు

Vennela Gaddar Sensational Comments on Pawan kalyan: తెలంగాణ పాలిటిక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాట్‌ టాపిక్‌గా మారారు. ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలను తెలంగాణకు చెందిన పలువురు నేతలు ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఖండించగా, తాజాగా ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు వెన్నెల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్‌కు నేరుగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Also read: Peddi ticket rates: పెద్దికి భారీ ఊరట.. తెలంగాణలో టికెట్‌ రేట్ల పెంపునకు గ్రీన్‌ సిగ్నల్‌

అవును తెలంగాణ మా అయ్యల జాగీరే..

”తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే.. ఈ ఉద్యమ గడ్డ ఈరోజు మా జాగీరు.. రేపు మా బిడ్డల జాగీరు. దీనిపై మాట్లాడే హక్కు వేరే ఎవరికీ లేదు.” అంటూ వెన్నెల ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరో డబ్బులు పంచితేనో, లేదా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తేనో ఊరికే రాలేదని, లక్షలాది మంది పోరాటం, అమరుల త్యాగాలతో ఏర్పడిందని వెన్నెల గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం కోట్లాది మంది ప్రజల ఆత్మగౌరవ పోరాటమని అని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారని, ఎందరో తల్లులు తమ కడుపు కోతను అనుభవించి బిడ్డలను కోల్పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అన్నందుకే నాడు చాలా మందిని ఎన్‌కౌంటర్ చేశారని, ఇవన్నీ కండ్ల ముందే ఉన్న సాక్ష్యాలన్నారు. అంత పెద్ద ఉద్యమం జరిగినా తాము నాడు ఎవరినీ ఒక్క మాట కూడా అనలేదని వెన్నెల పేర్కొన్నారు.

Also read: DK Shivakumar: డీకే శివకుమార్‌ అను నేను..! కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

మిమ్మల్ని సినిమా నటుడిగానే చూస్తాం..

పవన్ కల్యాణ్‌ను తెలంగాణ ప్రజలు కేవలం ఒక సినిమా నటుడిగా, అలాగే ఆయన గద్దర్ అభిమాని కాబట్టి ఆ కోణంలో మాత్రమే అభిమానిస్తారని.. అంతకుమించి ఇక్కడ రాజకీయంగా మాట్లాడితే ఒప్పుకునేది లేదని ఆమె తేల్చి చెప్పారు. కాగా, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయం పూర్తిగా వేడెక్కింది. ఓవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. పవన్‌కు మద్దతుగా నిలుస్తూ తెలంగాణ నేతల విమర్శలను తప్పుబడుతుండగా, మరోవైపు తెలంగాణ నుంచి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు పవన్‌పై ఎదురుదాడి తీవ్రతరం చేశారు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కామెంట్స్‌తో మొదలైన ఈ వివాదం అనేక మలుపులు తీసుకొని ప్రాంతీయ వివాదంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News