VH hunger strike enters second day: ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో ఓబీసీల కులగణనను కూడా చేర్చాలని, ప్రత్యేకంగా ఓబీసీ కాలమ్‌ను చేర్చాలని కోరుతూ ఆయన నిరాహారదీక్ష చేపట్టారు. హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆయన నివాసం వద్ద దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష శిబిరాన్ని పీసీసీ ఉపాధ్యక్షుడు సురేష్ కుమార్, రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ యాదవ్, యాదగిరి, శ్రీకాంత్ గౌడ్‌లతో పాటు పెద్ద ఎత్తున ద్వితీయ శ్రేణి నాయకులు తరలివచ్చి వీహెచ్‌కు సంఘీభావం ప్రకటించారు. అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ వీహెచ్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభ నేపథ్యంలో పలుచోట్ల కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/telangana-inter-admissions/

