Bandi Bhagirath Pocso Case: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో, బాధితురాలి తల్లి సంచలన ఆరోపణలు చేస్తూ లేఖ విడుదల చేశారు. భగీరథ్ వల్ల తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని, బండి సంజయ్ నుంచి తమకు ప్రాణ హాని ఉందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బండి భగీరథ్ మధ్యంతర బెయిల్‌పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది.
బండి సంజయ్ నుంచి తమకు ప్రాణ హాని ఉందని లేఖలో పేర్కొంటూ బాధితురాలి తల్లి లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. న్యాయం కోసం ఏప్రిల్ 23న బండి సంజయ్ నివాసానికి వెళ్లినప్పుడు, అక్కడ తమకు భరోసా లభించకపోగా బెదిరింపులు ఎదురయ్యాయని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా కేసు నమోదులో జాప్యం జరిగిందని వెల్లడించారు. మైనర్ అని చెప్పినప్పటికీ గంటల తరబడి స్టేషన్‌లో నిరీక్షించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
కాగా, 17 ఏళ్ల బాలికను బండి భగీరథ్ లైంగికంగా వేధించారనే ఆరోపణలపై, పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ తర్వాత పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, బండి భగీరథ్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తనను హనీట్రాప్ చేసి, రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని.. చంపుతామని బెదిరిస్తున్నారని బాధితురాలి కుటుంబంపై ఆయన కౌంటర్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
Also Read: https://teluguprabha.net/national-news/petrol-diesel-prices-increased-by-rs-3-across-the-country/
ఇదిలా బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా.. దానిపై గురువారం హైకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై నేడు తీర్పు ఇవ్వనుంది. ముందస్తు బెయిల్‌పై వచ్చే వారం విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

