HomeతెలంగాణPolling updates: పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల రాక ఆలస్యం.. చలి తీవ్రతే కారణం!

Polling updates: పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల రాక ఆలస్యం.. చలి తీవ్రతే కారణం!

Panchayat elections: రాష్ట్రంలో తొలి విడత పంచాయితీ ఎన్నికలు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగుతుంది. గ్రామాలపై చలి పంజా విసురుతుండటంతో ఉదయం పూట ఓటు వేసేందుకు ప్రజలు జంకుతున్నారు. ఉదయం వేళల్లో చలి ఎక్కువగా ఉండటం వల్ల వృద్ధులు పోలింగ్ స్టేషన్ల వద్ద కనిపించడంలేదు. దీంతో పోలింగ్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది. చలి ప్రభావంతో పోలింగ్‌ శాతం తగ్గకపోయినా.. ఉదయం మాత్రం ఓటు వేసేందుకు ఓటర్లు అంతగా ఉత్సాహం చూపించడంలేదు.

- Advertisement -

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు: గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ మద్దతుదారులను అభ్యర్థులుగా బరిలో నిలిపాయి. దీంతో సర్పంచ్‌ అభ్యర్థులకు అండగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రచారంలో పాల్గొన్నారు.  అయితే అభ్యర్థులు ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటికి కిలో చికెన్‌ను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు అభ్యర్థులు చికెన్ తినని వారి కోసం మటన్‌ను సైతం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. మగవారిని లక్ష్యంగా చేసుకొని క్వార్టర్ బాటిల్ లిక్కర్ పంపిణీకి కూడా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read:https://teluguprabha.net/telangana-news/voter-slip-download-process-for-panchayat-elections/

వలస ఓటర్ల రవాణాకు ప్రత్యేక ఏర్పాట్లు: ఎన్నికల నేపథ్యంలో వలస వెళ్లిన ఓటర్లను సైతం పోలింగ్ కోసం ఊర్లకు రప్పించేందుకు అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం బస్సులు, కార్లు, ఇతర వాహనాలను అద్దెకు తీసుకుని వారిని తరలిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రయాణ ఖర్చులను ఓటింగ్ ముగిసిన తర్వాత ఇచ్చేలా ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ ప్రలోభాలు, పోటాపోటీ వ్యూహాలతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం పతాక స్థాయికి చేరింది. పట్టణాల్లో ఉన్న ఉద్యోగులు, విద్యార్థులు గ్రామాల బాట పట్టడంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. అయితే నేడు జరగుతున్న తొలి విడత పోరులో విజయం ఎవరిని వరిస్తుందో ఈ సాయంత్రానికి తేలిపోనుంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News