Grand Inauguration of Vysyaraju jewelry : నమ్మకానికి మారుపేరుగా, నైపుణ్యానికి చిరునామాగా నిలిచిన ఒక సువర్ణ ప్రస్థానం నేడు తెలంగాణ గడ్డపై మరో మైలురాయిని చేరుకుంది. విశాఖ తీరంలో మొదలైన ఈ అద్భుత ప్రయాణం, నేడు హైదరాబాద్.. సోమాజిగూడలో అంగరంగ వైభవంగా ఆవిష్కృతమైంది. సినీ తార కాజల్ అగర్వాల్ రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారగా, నూతన షోరూమ్ అలంకరణ కళ్లను మిరుమిట్లు గొలిపింది. సాంప్రదాయానికి ఆధునికతను అద్దిన ఈ షోరూమ్‌లో అడుగుపెడితే ఏదో ఒక మాయాలోకంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతోంది. అసలు వైశ్యరాజు జ్యూయలర్స్ 16వ బ్రాంచిలో ఉన్న ఆ విన్నూతమైన కలెక్షన్లు ఏమిటి? సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరినీ ఆకట్టుకునేలా వారు ప్రకటించిన భారీ ప్రారంభోత్సవ ఆఫర్లు ఏ స్థాయిలో ఉన్నాయి? వెండి వస్తువులపై జీఎస్టీ (GST) కూడా కస్టమర్లు కట్టక్కర్లేదన్న వార్తలో నిజమెంత? ఆ ఆకర్షణీయమైన ధరల వివరాలు మీకోసం..

సువర్ణ ప్రస్థానం: విశాఖ నుంచి భాగ్యనగరం వరకు : వైశ్యరాజు జ్యూయలర్స్ తన 16వ బ్రాంచిని హైదరాబాద్‌లోని సోమాజిగూడ మెయిన్ రోడ్డులో అత్యంత వైభవంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వైశ్యరాజు భద్రగిరి రాజు గారు మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ప్రారంభమైన మా ప్రయాణం నేడు 16వ శాఖగా హైదరాబాద్‌కు చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. వినియోగదారుల నమ్మకమే మాకు కొండంత అండ” అని పేర్కొన్నారు. షోరూమ్ ప్రారంభమైన వెంటనే గౌరవనీయులు శ్రీ జామి భోజరాజు గారు మొదటి కొనుగోలు చేసి శుభారంభం పలికారు.
కళ్లు చెదిరే ఆఫర్లు.. జేబుకు భరోసా : ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్లను సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి.
బంగారు ఆభరణాలు: అన్ని రకాల 22KT బంగారు ఆభరణాలపై కేవలం 6% ఫ్లాట్ తరుగు మాత్రమే విధిస్తున్నారు. ఇది మార్కెట్ ధరతో పోలిస్తే కస్టమర్లకు భారీ ఊరట.
వజ్రాభరణాలు: VVS క్లారిటీ, EF కలర్ కలిగిన ఐజీఐ (IGI) సర్టిఫైడ్ డైమండ్ క్యారెట్ ధర కేవలం రూ.49,500 నుండే ప్రారంభం అవుతోంది.
వెండి వస్తువులు: సాధారణ వెండి వస్తువుల కొనుగోలుపై తరుగు లేదు, మజూరీ లేదు. అంతటితో ఆగకుండా, జీఎస్టీ (GST)ని కూడా సంస్థే భరిస్తుంది.
బల్క్ వెండి ఆఫర్: కేజీ వెండి వస్తువుల కొనుగోలుపై కేజీకి రూ.15,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది.
నిర్వాహకుల పర్యవేక్షణ : ఈ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో వైశ్యరాజు జ్యూయలర్స్ చైర్మన్ శ్రీ వైశ్యరాజు ఫల్గుణరాజు గారు, సంస్థ డైరెక్టర్లు శ్రీ వైశ్యరాజు నరేష్ గారు మరియు శ్రీ వైశ్యరాజు కిరణ్ కుమార్ రాజు గారు పాల్గొన్నారు. షోరూమ్‌లోని విభిన్నమైన డిజైన్లను చూసి అతిథులు, వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విన్నూతమైన కలెక్షన్లతో పాటు పారదర్శకమైన ధరలు అందించడమే తమ లక్ష్యమని యాజమాన్యం స్పష్టం చేసింది.

