Wage Increased for beedi workers: రాష్ట్రంలోని సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులకు యాజమాన్యాలు శుభవార్త అందించాయి. ఇటీవల కార్మిక సంఘాలు, యాజమాన్యాల మధ్య జరిగిన చర్చల ఫలితంగా వేతనాలను పెంచుతూ కొత్త ఒప్పందం కుదిరింది. ప్రతి వెయ్యి బీడీలకు ప్రస్తుతం రూ. 268.31 వేతనం ఇస్తుండగా.. దానిని రూ. 275.23 కి పెంచారు. ఇందులో జాతీయ సెలవులు, బోనస్, ఇతర ప్రయోజనాలు అన్నీ కలిపి ఉంటాయి. దీని ప్రకారం వెయ్యి బీడీలు చుడితే కార్మికులకు ఇచ్చే వేతనాన్ని రూ. 6 మేర పెంచేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి.
Also Read: https://teluguprabha.net/political-news/vijay-fans-issue-sensational-warning-to-the-governor/
మరోవైపు బీడీ ప్యాకింగ్ కార్మికులకు నెలకు అదనంగా రూ. 4,500 వేతనం పెరగనుంది. మునిమ్‌లు, చాటన్, బట్టీవాలా, ఇతర క్లర్క్‌లకు నెలకు రూ. 2,200 చొప్పున వేతనం పెంచుతూ యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త వేతన ఒప్పందం 2028 ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉండనుంది.
కాగా, రాష్ట్రంలోని బీడీ కార్మికుల్లో దాదాపు 98% మంది మహిళలే ఉండటం విశేషం. ప్రధానంగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని కార్మికులకు ఈ నిర్ణయంతో లబ్ధి చేకూరుతుంది. ప్రతి రెండేళ్లకోసారి కార్మిక సంఘాలు యాజమాన్యాలతో చర్చలు జరిపి వేతన ఒప్పందాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

