జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ..
అశ్వారావుపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం
పాలకుర్తి, (తెలుగు ప్రభ):పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన మొలూగురి వెంకన్న కుమార్తె మొలూగురి అఖిల రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీలకు ఎంపికైంది. గత నెల 15వ తేదీన నిర్వహించిన జనగామ జిల్లా స్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీల్లో అఖిల అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికైంది.ఈ నెల 10, 11 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో అఖిల జనగామ జిల్లా జట్టు తరఫున పాల్గొననుంది.
తన తండ్రి వెంకన్న ప్రోత్సాహంతో కబడ్డీ క్రీడలో రాణిస్తూ వివిధ స్థాయిల పోటీల్లో పాల్గొంటున్నట్లు అఖిల తెలిపింది.రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన అఖిలను గ్రామ పెద్దలు, మాజీ క్రీడాకారులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

