మహాదేవపూర్,(తెలుగు ప్రభ): మహాదేవపూర్ మండలం కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సురేష్‌ను అన్నారం గ్రామ కాంగ్రెస్ నాయకులు కలిసి ఘనంగా సన్మానించారు.
కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్, మాజీ ఎంపీటీసీ మంచినీళ్ల దుర్గయ్య, మాజీ సర్పంచ్ శేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకులు కోడిపెల్లి చిన్నమల్లు, వార్డు సభ్యులు నాగునూరి మొండయ్య, సెగ్గం శేఖర్, గ్రామ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బొమ్మెనా రమేష్, బెల్లంపల్లి కర్ణాకర్, పనేం సమ్మరాజు, రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఎస్సై సురేష్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. కాళేశ్వరం పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని నాయకులు ఎస్సై సురేష్‌ను కోరారు.

