-మూడు దశాబ్దాల తర్వాత ఒక్కటైన బాల్యమిత్రులు
మహబూబాబాద్, ( తెలుగు ప్రభ):చిన్ననాటి స్నేహాలు కాలం గడిచినా చెరిగిపోవని నిరూపిస్తూ.. మూడు దశాబ్దాల తర్వాత పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట చేరి ఆత్మీయ సమ్మేళనంతో సందడి చేశారు. మరిపెడ మండలం ఎల్లంపేట జెడ్పీహెచ్ఎస్లో 1994–95లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు 31 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడంతో పాఠశాల ప్రాంగణంలో బాల్య జ్ఞాపకాల పంచుకున్నారు.ఏళ్ల తరబడి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన బాల్యమిత్రులు ఒకే వేదికపై కలుసుకోవడంతో పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్లముందు కదలాడాయి.
అప్పటి ఆటలు, అల్లరి, తరగతి గదిలోని సరదా సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆనందంలో పలువురు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. తమ జీవితాలకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత బాటలో నడిపించిన గురువులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. అప్పటి గురువులు దశరధ రామయ్య, షరీఫ్, వీరస్వామి, శ్రీనివాస్‌తో పాటు ప్రస్తుత పాఠశాల హెచ్ఎం భాస్కర్‌ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. గురువులను సన్మానించుకోవడం తమ జీవితంలో మరిచిపోలేని అనుభూతిగా పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.
పాఠశాల తమకు కేవలం చదువు నేర్పిన ప్రదేశమే కాకుండా జీవితాంతం నిలిచిపోయే స్నేహబంధాలను అందించిన వేదిక అని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బోనగిరి సత్యనారాయణ, పవన్‌కుమార్, ధనుంజయ్, హనుమంతు, నాగభూషణం, యాకయ్య, మైసయ్య, హరినాయక్, నవీన్, మహమ్మద్ హుస్సేన్, అరుణ, భగవతి, జ్యోతి, పూలమ్మ తదితరులు పాల్గొన్నారు.

