Kakatiya University Chicken Issue: హాస్టల్ భోజనం అంటే చాలా మంది విద్యార్థులకు రుచించదు. కానీ.. ఆదివారం వస్తే స్పెషల్‌గా వండే చికెన్ లేదా మటన్ కోసం పడే ఆరాటం అంతా ఇంతా కాదు. ఆ ఆరాటమే ఇప్పుడు విశ్వవిద్యాలయంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. అది ఎంతలా అంటే.. కర్రలతో కొట్టుకునే వరకు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: https://teluguprabha.net/telangana/telangana-budget-sessions-from-march-16th-to-30th/
హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ(KU) హాస్టల్‌లో చికెన్ పంపిణీ విషయంలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం లంచ్ తర్వాత మిగిలిన చికెన్ పంపకాల విషయంలో ఎంబీఏ మొదటి సంవత్సరం, ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ గొడవ కాస్త ముదిరి విద్యార్థులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. ఈ ఘర్షణంలో దాదాపు ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మరో 20 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
చికెన్ కోసం యూనివర్సిటీలో చెలరేగిన గొడవ.. రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనలో ఏబీవీపీ నాయకులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో చర్చనీయాంశమైంది. దీంతో ఏబీవీపీ, పీడీఎస్‌యూ మద్దతు ఉన్న విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసినట్లుగా అయింది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ttd-clarity-on-snake-bite-incident-in-tirumala-q-line/
కాగా, ఘర్షణలో గాయపడిన విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్‌కు చేరుకుని పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై యూనివర్సిటీ అధికారులు విచారణకు ఆదేశించారు.
Kakatiya Universityలో విద్యార్థుల మధ్య ఘర్షణ. #Chicken పంపకాల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది.
The issue began over distribution of leftover chicken in the hostel, leading to a fight between MBA and Economics first-year students.pic.twitter.com/5lmC3wQFzT
— Milagro Movies (@MilagroMovies) February 23, 2026

