Thursday, March 12, 2026
Homeతెలంగాణవరంగల్Errabelli Dayakar: 'కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలి'- కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి

Errabelli Dayakar: ‘కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలి’- కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao: మున్సిపల్ ఎన్నికల్లో తెగించి పనిచేసిన కార్యకర్తలకు తానేం సమాధానం చెప్పుకోవాలని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు విచారం వ్యక్తం చేశారు. తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉద్రిక్తత నేపథ్యంలో దయాకర్‌ రావును పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తుండగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/warangal-news/congress-won-municipalities-in-jangaon-and-thorrur-through-lottery/

రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పని చేస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తానేం సమాధానం చెప్పాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో దయాకర్ రావును నర్సింహుల పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలిస్తుండగా.. ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఛైర్మన్‌ ఎన్నిక తీరును తప్పుబట్టిన ఎర్రబెల్లి.. తన జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. ప్రజలు తమకు పట్టం కడితే ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించి ఛైర్మన్‌ పదవిని లాక్కుందని విచారం వ్యక్తం చేశారు. తనను, తన భార్యను ఎందుకు అరెస్ట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/cm-revanth-reddy-review-on-municipal-administration-and-urban-development/

తొర్రూర్‌ మున్సిపాలిటీ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా ముగిశాయి. మొత్తం 16 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ 9, కాంగ్రెస్‌ 7 స్థానాలు గెలుచుకున్నాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్‌ ఎంపీ కడియం కావ్యల ఎక్స్‌ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్‌ బలం 9 కి చేరింది. దీంతో లాటరీ తీయగా.. ఇక్కడా కాంగ్రెస్‌ ఛైర్మన్‌ అభ్యర్థి పేరు రావడంతో విజయం అధికార పార్టీనే వరించింది. దీంతో మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి చేజారిపోవడంతో ఎర్రబెల్లి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News