Homeతెలంగాణవరంగల్Hanumakonda: ఢిల్లీలో ధర్నాకు తరలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Hanumakonda: ఢిల్లీలో ధర్నాకు తరలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

హనుమకొండ (తెలుగుప్రభ): ఓటరు సవరణల్లో అక్రమాలపై కాంగ్రెస్ అధిష్టానం చేపట్టిన పోరాటంలో భాగంగా సోమవారం ఢిల్లీలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించబోయే మహాధర్నాకు కాంగ్రెస్ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు తరలివెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తదితరులు ఆదివారమే ఢిల్లీకి తరలివెళ్లారు. ఓటరు సవరణ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలను నిరసిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాలో వారు పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News