వరంగల్(తెలుగుప్రభ): దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వరంగల్ జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగాయి. చారిత్రక ఖిలా వరంగల్ ఖుష్ మహల్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జెండాను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ: ఖుష్ మహల్ వద్ద ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ.. జిల్లా కలెక్టర్ డా. సత్యశారదతో కలిసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వేడుకలనుద్దేశించి మాట్లాడిన మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఈ సందర్భంగా అందరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు వరంగల్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోనూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా. సత్యశారద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


