Homeతెలంగాణవరంగల్Police Raid:అనంతారం శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Police Raid:అనంతారం శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

ఐదుగురు అరెస్ట్‌.. రూ.1.29 లక్షల నగదు, కారు, 7 బైక్‌లు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం

- Advertisement -

పర్వతగిరి,తెలుగు ప్రభ: పర్వతగిరి మండలం, అనంతారం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పర్వతగిరి ఎస్‌ఐ బొగం ప్రవీణ్‌ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది శుక్రవారం దాడి నిర్వహించారు.

ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకోగా మరో ఏడుగురు అక్కడి నుంచి పరారయ్యారు. అరెస్టయిన వారిలో వరంగల్‌ రంగశాయిపేటకు చెందిన శివరాత్రి వెంకటేష్‌ (33), రామగోపాల్‌పురానికి చెందిన కుంచాల ఏడుకొండలు (55), రంగశాయిపేటకు చెందిన సుర సాంబరాజు (35), నాయుడుపాపానికి చెందిన సుర సంతోష్‌ (33), నర్సంపేటకు చెందిన బొంత కిషన్‌ (36) ఉన్నారు.

పోలీసులు వారి నుంచి రూ.1,29,490 నగదు, ఒక ఐ20 కారు, ఏడు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది సెల్‌ఫోన్లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఏడుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మండల పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, పేకాట, జూదం వంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ బొగం ప్రవీణ్‌ హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News