Homeతెలంగాణవరంగల్Anganwadi Centre:అంగన్వాడీ కేంద్రం మూతపడలేదు

Anganwadi Centre:అంగన్వాడీ కేంద్రం మూతపడలేదు

నల్లబెల్లి, తెలుగు ప్రభ: రామతీర్థం అంగన్వాడీ కేంద్రం తొమ్మిది నెలలుగా మూసి ఉందన్న వార్తపై ఐసీడీఎస్ సూపర్‌వైజర్ హేమలత వివరణ ఇచ్చారు.అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి కొంతకాలంగా అనారోగ్యానికి గురికావడంతో రామతీర్థం తండా అంగన్వాడీ టీచర్‌ను ఇన్‌చార్జిగా నియమించినట్లు తెలిపారు.ప్రతిరోజూ అంగన్వాడీ ఆయ సూరమ్మ ఆధ్వర్యంలో ప్రీస్కూల్ పిల్లలు, గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనం, బాలామృతం, గుడ్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

టీచర్ విధులకు హాజరు కాకపోవడంపై తానే మూడుసార్లు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.ఒకసారి సీడీపీవో మధురిమ, డీడబ్ల్యూఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.రామతీర్థం అంగన్వాడీ టీచర్ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.
అంగన్వాడీ కేంద్రానికి రాని టీచర్‌కు ఇంతవరకు జీతం కూడా అందజేయడం లేదని పేర్కొన్నారు.టీచర్ లేకపోయినా అంగన్వాడీ కేంద్రాన్ని మూసివేయకుండా పిల్లలు, తల్లులు, గర్భిణులకు సేవలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.ఇన్‌చార్జి అంగన్వాడీ టీచర్ హయమ్మ ఆధ్వర్యంలో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా సేవలు కొనసాగుతున్నాయని హేమలత పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News