Homeతెలంగాణవరంగల్Red Cross Elections : రెడ్‌క్రాస్‌కు కొత్త కమిటీ.. చైర్మన్‌గా డా. అలెం అప్పయ్య

Red Cross Elections : రెడ్‌క్రాస్‌కు కొత్త కమిటీ.. చైర్మన్‌గా డా. అలెం అప్పయ్య

ములుగు,(తెలుగు ప్రభ): ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ములుగు జిల్లా శాఖ నూతన మేనేజింగ్ కమిటీ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అధికారి డా. ఏ. ధర్మానాయక్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ జరిగింది.

- Advertisement -

ఎన్నికల అనంతరం నూతన కమిటీని ప్రకటించారు. చైర్మన్‌గా డా. అలెం అప్పయ్య, వైస్‌చైర్మన్‌గా గంగిశెట్టి శ్రీనివాస్, కోశాధికారిగా శిరుప సతీష్‌కుమార్ ఎన్నికయ్యారు. స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా కొతపల్లి ప్రసాదరావు ఎన్నికయ్యారు. మేనేజింగ్ కమిటీ సభ్యులుగా చుంచు రమేష్, అబ్బు సతీష్, గూడూరు మహిపాల్, కొట్టే రాజిరెడ్డి, వద్ది శ్రీనాథ్, గారా నరసింహారావు, కోగిల సారయ్య, ముక్కు సుబ్బారెడ్డి, పింగిలి నాగరాజ్, వావిలాల రవితేజ, రామిడి కృష్ణారెడ్డి ఎన్నికయ్యారు.

సేవా విస్తరణే లక్ష్యం

2026–2029 కాలంలో జిల్లాలో రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించేందుకు నూతన కమిటీ సభ్యులు భావిస్తున్నారు. రక్తదాన కార్యక్రమాలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, ఆరోగ్య, సామాజిక సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని కమిటీ లక్ష్యంగా పెట్టుకున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగంగా సేవలు అందించడంతో పాటు జిల్లాలో మానవతా సేవలను మరింత బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు నూతన కమిటీ సభ్యులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్, జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శికి సమర్పించినట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News