Homeతెలంగాణవరంగల్Parakala: విద్యార్థుల సమస్యలపై గళమెత్తితే అరెస్టులా..?

Parakala: విద్యార్థుల సమస్యలపై గళమెత్తితే అరెస్టులా..?

పరకాల, తెలుగు ప్రభ: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను పరకాల పట్టణం లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బొచ్చు ఈశ్వర్‌ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.1000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పరకాల పట్టణానికి నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

విద్యారంగ సమస్యలపై పోరాటం ఆగదు

రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బొచ్చు ఈశ్వర్‌ అన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోరినందుకు ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. ఎన్ని అరెస్టులు చేసినా విద్యార్థుల సమస్యలపై పోరాటాన్ని విరమించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కులు, విద్యారంగ పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు.

Also Read:YCP:కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇస్తే సస్పెండ్‌ చేస్తారా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News