HomeతెలంగాణRed Alert: తెలంగాణలో భానుడి భగభగ.. నిజామాబాద్‌లో 46 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత!

Red Alert: తెలంగాణలో భానుడి భగభగ.. నిజామాబాద్‌లో 46 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత!

Heat waves: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. ఈ వేసవి సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఈరోజు నమోదయ్యాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. నల్గొండ, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో 45.8 డిగ్రీలకు చేరింది.

- Advertisement -

రెడ్ అలర్ట్ జారీ: సాధారణంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ నమోదైతే వాతావరణ విభాగం ‘రెడ్ అలర్ట్’ ప్రకటిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.అటు రాజధాని హైదరాబాద్‌లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉండనుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గరిష్టంగా 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 36 గంటల పాటు ఉష్ణోగ్రతలు ఇలాగే తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

జాగ్రత్తలు తప్పనిసరి: తీవ్రమైన వేడి గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా మంచి నీరు, పండ్ల రసాలు అధికంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News