HomeTop StoriesTirumala: అలిపిరి మెట్ల మార్గంలో ఏడు కొండలెక్కిన 116 ఏళ్ల బామ్మ.. వీఐపీ బ్రేక్ దర్శనం...

Tirumala: అలిపిరి మెట్ల మార్గంలో ఏడు కొండలెక్కిన 116 ఏళ్ల బామ్మ.. వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ!

Tirumala: భగవంతుడిపై భక్తి, మనసులో దృఢ సంకల్పం ఉంటే వయసుతో నిమిత్తం లేదని నిరూపించారు 116 ఏళ్ల శతాధిక వృద్ధురాలు నవనీతమ్మ. నేటి తరం యువత 20, 30 ఏళ్ల వయసులోనే కొండ ఎక్కడానికి వెనుకాడుతున్న తరుణంలో.. ఒంట్లో సత్తువ లేకపోయినా అడుగులో అడుగు వేసుకుంటూ అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఆమె తిరుమల శ్రీవారి చెంతకు చేరుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న టీటీడీ యంత్రాంగం వెంటనే స్పందించింది. ఆమెకు స్వామివారి వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యాన్ని కల్పించింది.

- Advertisement -

ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనం: మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకున్న నవనీతమ్మకి, ఆమె కుటుంబ సభ్యులకు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ శ్రీ ముద్దాడ రవిచంద్ర వేదపండితులతో వేదాశీర్వచనం చేయించారు. అనంతరం పట్టువస్త్రం కప్పి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ శతాధిక వృద్ధురాలైన నవనీతమ్మ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.

హర్షం వ్యక్తం చేసిన టీటీడీ చైర్మన్: ఈ అద్భుత ఘట్టంపై టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. “116 ఏళ్ల వయసులో నవనీతమ్మ నడుచుకుంటూ వెళ్లి సంకల్పబలం ఎలా ఉంటుందో నిరూపించారు. దైవాన్ని దర్శించడం కాదు, అర్థం చేసుకోవడం ముఖ్యమని ఆమె నిరూపించారు. నవనీతమ్మని గుర్తించడంలో సహకరించిన సోషల్ మీడియా మిత్రులకు, టీటీడీ విజిలెన్స్ అధికారులకు నా ధన్యవాదాలు. ఒక భక్తురాలి జీవితకాల కోరిక నెరవేరిన ఈ సందర్భం మా అందరికీ ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించింది” అని చైర్మన్ పేర్కొన్నారు.

Also Read-Amarnath Yatra: వైభవంగా ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర.. అనంతనాగ్‌లో హైఅలర్ట్!

టీటీడీకి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు: శ్రీవారి దర్శనానంతరం నవనీతమ్మ మనవడు మీడియాతో మాట్లాడుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. “మా అమ్మమ్మ జీవితకాల కోరికను నెరవేర్చి, మా కుటుంబ సభ్యులందరికీ శ్రీవారి దివ్య దర్శన భాగ్యం కల్పించిన టీటీడీ చైర్మన్‌కి, అధికారులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు” అని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News