HomeTop StoriesBook Fair: పుస్తక ప్రియులకు పండుగ.. డిసెంబర్‌ 18 నుంచి 39వ హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌

Book Fair: పుస్తక ప్రియులకు పండుగ.. డిసెంబర్‌ 18 నుంచి 39వ హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌

హైదరాబాద్ (తెలుగు ప్రభ): పుస్తక ప్రియులు ఎంతగానో ఎదురుచూసే 39వ హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది డిసెంబరు 18 నుంచి 28 వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కమిటీ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు సమీపంలోని ఎన్టీఆర్‌ స్టేడియం (తెలంగాణ కళా భారతి) ప్రాంగణంలో వరుసగా 11 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ఈ సందర్భంగా ప్రతి రోజూ వివిధ సాహిత్య చర్చలు, పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశ నలుమూలల నుంచి వివిధ పబ్లిషర్లు, రచయితలు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News