HomeTop StoriesDelhi: దిల్లీలో విషాదం.. ఏసీ పేలి 9 మంది మృతి

Delhi: దిల్లీలో విషాదం.. ఏసీ పేలి 9 మంది మృతి

AC Blast: దిల్లీలో ఘోర విషాదం నెలకొంది. వివేక్ విహార్ ప్రాంతంలోని ఒక నివాస సముదాయంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం తొమ్మిది మంది ప్రాణాలను బలిగొంది. తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.

- Advertisement -

రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది: ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంట్లోని ఏసీ పేలడం వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారు తప్పించుకునే అవకాశం లేకపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 9 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు: ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు, ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. 14 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రెస్క్యూ టీమ్ భవనంలో చిక్కుకున్న పలువురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News