Sunday, February 8, 2026
HomeTop StoriesACB Raids: హన్మకొండ అదనపు కలెక్టర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

ACB Raids: హన్మకొండ అదనపు కలెక్టర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

Hanmakonda Additional Collect: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో హన్మకొండ అదనపు కలెక్టర్ (డిప్యూటీ కలెక్టర్) వెంకట్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించారు. వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు: తెలంగాణ వ్యాప్తంగా వెంకట్ రెడ్డికి సంబంధించిన దాదాపు 10 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హన్మకొండ కలెక్టర్ నివాసం, కార్యాలయంతో పోటుగా.. హైదరాబాద్, రంగారెడ్డిలో ఆయనకు సంబంధించిన ఇళ్లు మరియు బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Also read-Congress: నన్నే ఎందుకు పిలుస్తున్నారు..? కేసీఆర్, కేటీఆర్‌లను పిలవండి: హరీశ్‌పై సామ సెటైర్లు

లంచం కేసుతో బయటపడ్డ అక్రమాస్తులు: గత నెలలో ఒక ప్రైవేటు పాఠశాల గుర్తింపు పత్రాల పునరుద్ధరణ కోసం రూ. 60,000 లంచం తీసుకుంటూ వెంకట్ రెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆ ఘటనపై లోతుగా విచారణ జరిపిన అధికారులకు.. ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజాము నుంచే అధికారులు రంగంలోకి దిగారు.

అదుపులోకి ముగ్గురు ఉద్యోగులు: ఈ కేసు దర్యాప్తులో భాగంగా అదనపు కలెక్టర్‌తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతోనే ఈ సోదాలు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. తనిఖీలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News