HomeTop StoriesACB Raids: టీజీ రెడ్కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

ACB Raids: టీజీ రెడ్కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

ACB Raids: తెలంగాణలో ఏసీబీ (ACB) అధికారులు మరోసారి రంగంలోకి దిగారు. రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డీఈ ముత్యం వెంకటరమణ ఇంట్లో తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.

- Advertisement -

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు.. డీఈ ముత్యం వెంకటరమణ నివాసాలు, కార్యాలయాలు లక్ష్యంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. ఆయన బంధువులు మరియు సన్నిహితుల ఇళ్లలో తెల్లవారుజాము నుంచే తనిఖీలు కొనసాగుతున్నాయి. మాదాపూర్‌లోని వెంటకరమణ ఇంటితో పాటు మరో 10 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయన కార్యాలయం, బంధువుల ఇళ్లలో ఏసీబీ బృందాలు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో డీఈ ముత్యం వెంకటరమణపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఉంటున్న ఇంట్లో పలు కీలక డాక్యుమెంట్లు లభ్యం అయినట్లు తెలుస్తోంది.

Also Read-CM Revanth: నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి నిరసన!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News