Madhavi Latha: ప్రముఖ యూట్యూబర్, నా అన్వేషణ ఫేమ్ అన్వేష్‌పై నటి మాధవీలత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల అన్వేష్ ఓ ఆధ్యాత్మిక జగద్గురువును ఉద్దేశించి ఎగతాళిగా చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “నిన్ను కనేముందు మీ నాన్న కండోమ్ వాడి ఉంటే.. ఈ రోజు సమాజానికి ఈ దరిద్రం వదిలేది” అంటూ అన్వేష్‌ను ఉద్దేశించి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.
సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోం: సనాతన ధర్మాన్ని, పీఠాధిపతులను కించపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని మాధవీలత స్పష్టం చేశారు. జగద్గురువును అవమానించడాన్ని తీవ్రంగా పరిగణించిన ఆమె.. ఒక లైవ్ వీడియోలో మాట్లాడుతూ అన్వేష్‌ను లక్ష్యంగా చేసుకుని అత్యంత పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు. పవిత్రమైన ఆధ్యాత్మిక గురువులను తక్కువ చేసి మాట్లాడటం అన్వేష్ అహంకారానికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు.
కర్మ అనుభవించక తప్పదు: జగద్గురువుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అన్వేష్ త్వరలోనే తగిన శాస్తి అనుభవిస్తాడని మాధవీలత హెచ్చరించారు. “నువ్వు ఎంతటి వాడివైనా సరే.. నీ పతనం త్వరలోనే చూస్తావు. దేవుడి స్క్రిప్ట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. నువ్వు చేసిన తప్పుకు కర్మ అనుభవించక తప్పదు” అంటూ ఆమె గట్టిగా హెచ్చరించారు.
Also read-POCSO Case: బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు!
సోషల్ మీడియాలో మాటల యుద్ధం: నచ్చావులే, స్నేహితుడా వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న మాధవీలత.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో, సామాజికాంశాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా హిందూ ధర్మంపై వచ్చే అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆమె తక్షణమే స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజా వివాదం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అటు అన్వేష్ అభిమానులకు, ఇటు మాధవీలత మద్దతుదారులకు మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తోంది.

