HomeTop StoriesUSA Vs Iran: మరోసారి ఇరాన్‌పై విరుచుకుపడ్డ యూఎస్ దళాలు!

USA Vs Iran: మరోసారి ఇరాన్‌పై విరుచుకుపడ్డ యూఎస్ దళాలు!

America attacks Iran: ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులకు తెగబడింది. దక్షిణ ఇరాన్‌లోని కీలకమైన క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని యూఎస్ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

- Advertisement -

ఆత్మరక్షణలో భాగంగా దాడులు: తమ బలగాలకు ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారంతోనే ముందస్తు దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది. ఇరాన్ వైపు నుంచి ఎదురుకాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి.. ఆయా కీలక ప్రదేశాలను ధ్వంసం చేసినట్లు స్పష్టం చేసింది.

Also read-Donald Trump: అతడి వల్లే అమెరికాకు ఇన్ని సమస్యలు.. మాజీ అధ్యక్షుడిపై నోరు పారేసుకున్న ట్రంప్‌..!

సంయమనం పాటిస్తూనే రక్షణ చర్యలు: ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న తరుణంలో ఈ దాడి జరగడం గమనార్హం. అయితే తాము ఒప్పందానికి కట్టుబడి సంయమనం పాటిస్తూనే.. తమ సైనికుల భద్రతను కాపాడుకునేందుకు ఈ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ వివరించారు. అమెరికా దళాలపై దాడికి ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని ఈ చర్య ద్వారా యూఎస్ గట్టి హెచ్చరికలు పంపింది. ఈ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News