HomeTop StoriesAmaravathi: అమరావతికి రాజముద్ర.. 2024 జూన్‌ 2 నుంచి ఏపీ రాజధాని హోదా

Amaravathi: అమరావతికి రాజముద్ర.. 2024 జూన్‌ 2 నుంచి ఏపీ రాజధాని హోదా

AP capital Amaravathi: ఏపీ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభించింది. 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చట్టపరమైన ప్రక్రియ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 సవరణ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. దీంతో అధికారికంగా ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం-2026’ (నం. 7/2026) అమల్లోకి వచ్చింది.

- Advertisement -

అమరావతికి రాజముద్ర: ఏపీ అసెంబ్లీ పంపిన తీర్మానం మేరకు.. కేంద్ర హోంశాఖ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ సవరణ బిల్లుకు ఈ నెల 1, 2 తేదీల్లో ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. సోమవారం కేంద్ర న్యాయశాఖ ఈ బిల్లును రాష్ట్రపతికి పంపింది. దీంతో ఆర్టికల్ 111 ప్రకారం ఆమె తక్షణమే ఆమోదముద్ర వేశారు. అనంతరం కేంద్ర న్యాయశాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

తాజా చట్టంలోని కీలక అంశాలు: 2024 జూన్ 2 నుంచి అమరావతికి రాజధాని హోదా దక్కినట్లు చట్టంలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)ని సవరించి అమరావతి పేరును చేర్చారు. సీఆర్‌డీఏ (CRDA) చట్టం-2014 కింద నోటిఫై చేసిన ప్రాంతాలన్నీ అమరావతి పరిధిలోకి వస్తాయని వివరణ ఇచ్చారు. దీనివల్ల భవిష్యత్తులో సరిహద్దులు లేదా ప్రాంతాల విషయంలో ఎలాంటి చట్టపరమైన వివాదాలకు తావుండదు.

Also read-CM Chandrababu: నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌

పార్లమెంటుకే సర్వాధికారాలు: ఈ తాజా చట్ట సవరణతో అమరావతి హోదాకు తిరుగులేని రక్షణ లభించింది. ఇకపై రాజధాని విషయంలో ఎలాంటి మార్పులు చేయాలన్నా అది కేవలం పార్లమెంటు ద్వారానే సాధ్యమవుతుంది. రాజధాని విషయంలో రాష్ట్ర శాసనసభ చేసే సవరణలకు చట్టబద్ధమైన విలువ ఉండదని ఈ చట్టం ద్వారా స్పష్టమైంది. ఈ పరిణామంతో ఏపీ రాజధానిపై గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడింది. ఇక ఏపీ రాజధాని అంటే అమరావతి అని అధికారికంగా చెప్పోచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News