HomeTop StoriesAP CM: సైకోలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది.. ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు!

AP CM: సైకోలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది.. ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు!

CM Chandrababu: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీగా ప్రజలు గుర్తించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లేకొద్దీ సైకోలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందని విమర్శించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన.. వైఎస్ కుటుంబానికి సంబంధించిన పలు సంచలన విషయాలపై స్పందించారు.

- Advertisement -

ప్రజాస్వామ్యానికి వారు పనికిరారు: ఇటీవల వెలుగులోకి వస్తున్న వైఎస్ కుటుంబ అరాచకాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని చంద్రబాబు అన్నారు. ఆ కుటుంబం చేసిన కొన్ని అరాచకాలు తనకు కూడా ఇప్పటివరకు తెలియవని వ్యాఖ్యానించారు. “ఇలాంటి అరాచక శక్తులు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం పనికిరావు. తుపాకీ పట్టిన మావోయిస్టులే గన్‌తో రాజ్యాధికారాన్ని సాధించలేకపోయారు. మరి వీళ్లు మాత్రం గొడ్డలితో రాజకీయాలు చేస్తూ ఎలా సాధిస్తారు?” అని ఆయన ప్రశ్నించారు.

Also read-Amaravati: అమరావతిలో ఆ సంస్థలకు భూ కేటాయింపులు

నేటి తరానికి తెలుస్తున్నాయి: గతంలో జరిగిన సంఘటనలు, ప్రస్తుత పరిణామాల ద్వారా వైకాపా నడుపుతున్న హత్యా రాజకీయాల గురించి నేటి యువతరానికి కూడా పూర్తిగా అవగతమవుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్ కుటుంబ అంతర్గత వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఆ పార్టీలో నైరాశ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News