AP CM Chandrababu: మహానాడు సందర్భంగా తెలంగాణపై బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుపట్టారు. తెలంగాణపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదని పార్టీ నేతలను ఆదేశించారు. చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపై: రాష్ట్రాలు రెండు అయినప్పటికీ తెలుగు జాతి ఒక్కటేనని చంద్రబాబు అన్నారు. టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని గుర్తుచేశారు. ఆ రాష్ట్రంలో ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉందని వ్యాఖ్యానించారు. ఎంతో ఉత్సాహంగా తరలివచ్చి మహానాడును విజయవంతం చేసిన తెలంగాణ పార్టీ శ్రేణులకు, నాయకులకు చంద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
Also read-Telangana: ఉదయం 10 లోపే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. అధికారులను ఆదేశించిన సీఎం!

