HomeTop StoriesDelimitation: రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్!

Delimitation: రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్!

AP CM Chandrababu: రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును అడ్డుకున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు సాధించేదేమిటని ప్రశ్నించారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, ఎం.కే. స్టాలిన్‌ల తీరును తప్పుబట్టారు.

- Advertisement -

రేవంత్ రెడ్డికి అవగాహన లేదు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి డీలిమిటేషన్‌పై ఎలాంటి అవగాహన లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తమమైన మార్గమని అన్నారు. దీనివల్ల ప్రాతినిధ్యం పెరగడమే తప్ప.. దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గదని ఆయన వివరించారు. దక్షిణాది ప్రయోజనాల విషయంలో భయాందోళనలు సృష్టించడం మానుకుని కోరారు.

Also read-Jagtial: కేసీఆర్‌ నోట మళ్లీ ‘పుననిర్మాణం’ పదం.. అధికార మార్పుకు సంకేతమా?

విపక్షాల తీరుపై విమర్శలు: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు సాధించేదేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. 2023లోనే ఈ బిల్లులు ఆమోదం పొందాయని అన్నారు. ఇప్పుడు వాటి అమలు కోసం ప్రక్రియ మొదలుపెడితే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలకే విపక్షాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆరోపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News